దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం, మరియు బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన కమిటీ సభ్యులకు తెలిపారు.