గద్వాల పట్టణంలోని పలు కాలనీల్లో రాత్రి పగలు వీధిలైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఇలా వెలగడం వల్ల కరెంటు వృధాతో పాటు ఎస్ఈడి బల్బుల సామర్థ్యం తగ్గుతుందని పట్టణవాసులు అంటున్నారు. 2, 3, 10, 11, 20 వార్డుల్లో పగటిపూట వెలుగుతున్న విద్యుత్ లైట్ల నిర్వహణపై సంబంధిత అధికారులు దృష్టి సారించి వేసవిలో విద్యుత్తు వృధాను అరికట్టాలని సోమవారం ఆయా వార్డుల ప్రజలు కోరుతున్నారు.