రేపు అనగా మంగళవారం నారాయణపేట పట్టణ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ తెలిపారు. సింగారం వద్ద ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం 11: 30 గంటలకు సమావేశం ఉంటుందన్నారు. సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.