దేశ ప్రధానిగా ముచ్చటగా మూడవ సారి గెలిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజి అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని 22వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు సంబందించిన కర పత్రాలను ప్రజలకు అందించి బీజేపీ కి ఓటు వేసి ఎంపీగా డీకే అరుణను గెలిపించాలని కోరారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, బీఆర్ఎస్ పనైపోయిందన్నారు.