రాజకీయ కక్షతోనే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసారని, అరెస్టు వెనుక బీజేపీ హస్తముందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. నేడు అయన మీడియా తో మాట్లాడుతూ....కేంద్రానికి తెలియకుండా మాజీ ముఖ్యమంత్రి ని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. బాబు కోసం ఐటి ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తన మద్దతు ఉంటుందన్నారు.