సెల్‌ఫోన్ ఎక్కువగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నూర్‌నగర్‌లో నివాసముండే సంజీబ్ మండల్ కూతురు ఇషికా మండల్(13) 8వ తరగతి చదువుతున్నది. అయితే ఆమె సెల్‌ఫోన్‌ను అదే పనిగా చూస్తుండటాన్ని తల్లిదండ్రులు గమనించి, మందలించారు. మనస్థాపానికి గురైన ఇషికా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.