తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్లో 62.85% ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్లో 3,80,920 మంది హాజరైతే 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించగా, 67.27% ఉత్తీర్ణత నమోదు అయింది. A గ్రేడ్లో 1.73 లక్షల మంది, B గ్రేడ్లో 1.44 లక్షల మంది పాస్ అయ్యారు. సెకెండ్ ఇయర్లో 1.84 లక్షల మంది అబ్బాయిలు పరీక్ష రాయగా, 1.11 లక్షల మంది పాస్ అయ్యారు. అమ్మాయిల్లో 1.96 మంది పరీక్ష రాయగా, 1.44 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు.