కేంద్ర ఇంటెలీజెన్స్ సమాచారంతో హైదరాబాద్‌లో మధ్యప్రదేశ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో నగరంలో 16మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో భూపాల్ చెందిన 11మంది, హైదరాబాద్‌కు చెందిన ఐదుమంది ఉన్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, సాహిత్యం, కత్తులు, ఎలక్ట్రానిక్స్ డివైస్, డ్రాగర్స్ స్వాధీనం చేసుకున్నట్లు ATS తెలిపింది. వీరు 18నెలల నుంచి HYDలో మకాం వేశారు. ఇందులో ఐదుమందిని మధ్యప్రదేశ్‌కు తరలించారు.