సూర్యాపేట పట్టణం స్థానిక ఇందిరమ్మ కాలనీలో లే -అవుట్ 3లో శైలజ అనే ఆమెకు ప్రభుత్వం ఇచ్చిన 338 ప్లాట్ ను భద్రయ్య అనే అతను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేస్తుండగా శైలజ ఫిర్యాదు మేరకు ఆ నిర్మాణాన్ని సోమవారం మున్సిపల్ సిబ్బంది కూల్చి వేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.