ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హరోమ్‌హార' నుండి భక్తిత్వ విముక్తి వీడియో సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 04:51 PM

జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన 'హరోమ్ హర' చిత్రం జూన్ 14, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని భక్తిత్వ విముక్తి వీడియో సాంగ్ ని విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయికగా నటించింది. సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, రవి కాలే మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సుమంత్ నాయుడు ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com