ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1M+ వ్యూస్ ని సొంతం 'తంగలన్' ఫస్ట్ సింగల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 04:49 PM

దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో విక్రమ్ తన తదుపరి సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'తంగలన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాపై ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా తెలుగు వెర్షన్ ఫస్ట్ సింగల్ ని మనకి మనకి అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ వన్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని పోస్ట్ చేసారు. ఈ విషయాని తెలియజేసేందుకు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి చిత్ర బృందం ప్రకటించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com