ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫీసియల్ : 'జా'క్ ని ఓవర్సీస్ లో విడుదల చేయనున్న ప్రముఖ బ్యానర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 04:53 PM

బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'జాక్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి అధికారకంగా ప్రకటించారు.

ఈ చిత్రంలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో నరేష్, బ్రహ్మాజీ, ప్రకాష్ రాజ్ మరియు సుబ్బరాజు సహాయక పాత్రలలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com