ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శశివదనే : గోదారి అటువైపో సాంగ్ విడుదలకి టైమ్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 04:26 PM

సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో పలాస 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'శశివదనే' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని గోదారి అటువైపో సాంగ్ ని మార్చి 28న సాయంత్రం 5:01 గంటలకి విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.


ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ లో రక్షిత్ అట్లూరికి జోడిగా కోమలీ ప్రసాద్ నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 19, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రవీణ్ యెండమూరి, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ కీలక పాత్రలు పోషించారు.


గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ SVS కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. లిమిటెడ్ మరియు AG ఫిల్మ్ కంపెనీతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవణ వాసుదేవన్ మరియు అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com