ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్‌పోర్టులో కాజల్ అగర్వాల్ సందడి

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 02:23 PM

 స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ ప్రస్తుతం ఇండియన్‌ 2 సినిమాతో బిజీగా ఉంది. ఇందులో ఆమె కమల్‌ హాసన్‌ జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీ ఎయిర్‌పోర్టులో సందడి చేసింది మెరిసింది. తన కుమారుడు నీల్‌ కిచ్లుతో కలిసి ఆమె ఎయిర్‌పోర్టులో మెరిసింది.బ్లాక్‌ కలర్‌ టీ షర్ట్‌, లైట్‌ బ్లూ జీన్స్‌లో కాజల్‌ ఆకట్టుకుంటుంది. ఎయిర్‌పోర్టులో ఆమెను స్థానికులంతా కాజల్‌ను చూసేందుకు ఆసక్తి చూపించారుఅంతేకాదు ఈమె సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబపడ్డారు. ఈ క్రమంలో కాజల్‌ ఫ్యాన్స్‌తో కలిసి ఫోటోలను ఫోజులు ఇచ్చింది కూడా.ప్రస్తుతం ఆమె ఎయిర్‌ఫోర్టు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. కాగా ఇందులో ఆమె కొడుకు నీల్‌ కిచ్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.కాగా కాజల్‌ అగర్వాల్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. పెళ్లై, ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఇప్పటికే అదే ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌, అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నారు.పెళ్లి తర్వాత సినిమాలకు కాస్తా గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ రీఎంట్రీలోనూ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతుంది.ఇటీవల 'భగవంత్‌ కేసరి'లో అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం 'ఇండియన్‌ 2' మూవీతో బిజీగా ఉంది.ఇందులో ఆమె కమల హాసన్‌తో జోడీ కట్టిన సంగతి తెలిసిందే. డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఎన్నో వివాదాలు, వాయిదాల మధ్య షూటింగ్‌ను జరుపుకుంటుంది.ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉన్నట్టు గతంలో డైరెక్టర్‌ శంకర్‌ ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపాడు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com