ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుష్ప-2లో జగపతిబాబు..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 12:26 PM

సుకుమార్ డైరెక్షన్ లో అల్లుఅర్జున్ పుష్ప-2 సిద్ధమవుతోంది. ఈ సీక్వెల్ లో మరో స్టార్ యాక్టర్ నటించబోతున్నాడనే వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో స్టార్ యాక్టర్ జగపతిబాబు కనిపించబోతున్నాడట. విశాఖలో 20 రోజుల షూటింగ్ అనంతరం తర్వాత షెడ్యూల్ లో జగ్గూభాయ్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన పాత్రపై క్లారిటీ లేదని సమాచారం.


2021లో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా సమంత స్పెషల్ సాంగ్ లో అలరించిన చిత్రం పుష్ప.. ఇందులో సునీల్, అజయ్, అనసూయ తదితరులు నెగిటివ్ రోల్ పోషించి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. మొదటి సినిమా భారీ సక్సెస్ పొందడంతో ఇప్పుడు సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com