ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, టైటానికి సినిమాని 4కే ప్రింట్‌తో త్రీడీ వెర్షన్లో రీ రిలీజ్ చేయనున్నారు.టైటానిక్ ఓడలో పరిచయమై, ప్రేమికులుగా దగ్గరయ్యే జాక్, రోజ్ చివరికి ఓడ ప్రమాదంలో దూరమయ్యే ఈ విషాదభరిత ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ లవ్‌స్టోరీ విడుదలై 25 ఏళ్లయింది.