ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందీ "దృశ్యం 2" రిలీజ్ డేట్ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 11:51 AM

మలయాళంలో మోహన్ లాల్ లీడ్ రోల్ లో నటించిన "దృశ్యం" సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అదే పేరుతో ఈ సినిమా తెలుగు, హిందీలో కూడా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది. తిరిగి మళయాళంలోనే గతేడాది దృశ్యం 2 రిలీజవ్వగా అది కూడా పెద్ద హిట్ అయ్యింది. అదే పేరుతో గతేడాదిలోనే తెలుగులో కూడా రీమేక్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తాజాగా హిందీలో దృశ్యం 2 రిలీజ్ డేట్ ఖరారయ్యింది. నవంబర్ 18న ప్రేక్షకులను థ్రిల్ చెయ్యడానికి రెడీ అవుతుంది.
హిందీ దృశ్యం మొదటి భాగంలో నటించిన తారాగణంతోనే దృశ్యం 2 సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ అభిషేక్ పాఠక్. ఇందులో అజయ్ దేవగణ్, శ్రేయా శరణ్, టబు, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి ఇదే ఆఖరి వర్కింగ్ డే. పనోరమా స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com