కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ , టాలీవుడ్ యంగ్ డైరెక్టర్, "జాతిరత్నాలు" ఫేమ్ కేవి అనుదీప్ కాంబోలో రాబోతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ "ప్రిన్స్". గతవారంలో టైటిల్ ను, శివకార్తికేయన్ ఫస్ట్ లుక్ ను, హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్లను రివీల్ చేసిన చిత్రబృందం ఈ రోజు రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసింది. వాస్తవానికి, వినాయక చవితి సందర్భంగా, ఈ సినిమా ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. ఐతే, ఈ రిలీజ్ డేట్ ను దీపావళికి వాయిదా వేస్తున్నట్టు తెలుపుతూ, చిత్రబృందమంతా కలిసి చేసిన ఒక ఫన్నీ వీడియోను ఈ రోజు రిలీజ్ చేసారు. ఇందులో డైరెక్టర్ అనుదీప్, హీరో శివకార్తికేయన్, సత్యరాజ్, హీరోయిన్ మరియా ర్యాబోషప్క కలిసి ఫన్నీ గా, పిచ్చాపాటి మాట్లాడుకుంటారు.
సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, శాంతి టాకీస్ సంయుక్త బ్యానర్ లపై డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, పుస్కర్ రామ్ మోహన రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు,తమిళ భాషలలో విడుదలవనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.