కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార, GS విక్నేష్ దర్శకత్వంలో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లేడీ సూపర్ స్టార్ నటించిన 'O2' సినిమాని తన ప్లాట్‌ఫారమ్‌లో డైరెక్ట్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా ఈరోజు నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ థ్రిల్లర్ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రిత్విక్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది.