ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుశాంత్ తొలి వెబ్ సిరీస్‌కి క్రేజీ టైటిల్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 02:10 PM

భారతీయ నటీనటులు ఈ మధ్యకాలంలో వెబ్ ఫిల్మ్‌లు అండ్ వెబ్ సిరీస్‌లు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. తాజాగా ఇప్పుడు టాలీవుడ్‌ యంగ్ హీరో OTT ప్లాట్ఫారంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కరెంట్, అడ్డా, చి ల సౌ, అలా వైకుంఠపురములో వంటి సినిమాలలో నటించి  మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని సుశాంత్  ఇప్పుడు ZEE5 వెబ్ సిరీస్‌కి సైన్ చేశారు. సౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ZEE5 సోషల్ మీడియా ప్రొఫైల్ లో ఈ సిరీస్ కి 'ఇది మా నీళ్ల ట్యాంక్' అనే టైటిల్‌ను లాక్ చేసినట్లు ప్రకటించింది. సుశాంత్ తన తొలి సిరీస్‌లో వంశీ అనే పోలీసుగా నటిస్తున్నాడు. ప్రియా ఆనంద్, లావణ్య రెడ్డి, నిరోషా రథా, దివి వడ్త్యా, వాసు తదితరులు ఈ సిరీస్ లో ముఖ్య పాత్రలు పోషించారు. కొల్లా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రవీణ్ కొల్లా ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com