ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'విరాట పర్వం'

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 02:08 PM

వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి 'విరాట పర్వం' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ డ్రామాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. రానా అభిమానులు అండ్ సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విరాట పర్వం సినిమా జూన్ 17, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు 'విరాట పర్వం' సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డ్ నుండి U/A సర్టిఫికేట్ పొందింది అని సమాచారం. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, ఈశ్వరీ రావు, రవి ఆనంద్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com