హుషారు మరియు రౌడీ బాయ్స్ వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లతో ప్రేక్షకుల గుర్తింపును సంపాదించుకున్న యువనటుడు తేజ్ కూరపాటి. హరి కొలగాని డైరెక్షన్ లో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ, నవకాంత్ లు హీరోలుగా నటిస్తున్న చిత్రం "షికారు". అప్ కమింగ్ బ్యూటీ సాయి ధన్సిక ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర కీలకపాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను పి ఎస్ ఆర్ కుమార్ నిర్మించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో షికారు తాలూకా ఏపీ థియేట్రికల్ రిలీజ్ హక్కులను ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ చేజిక్కించుకోవడం ఆసక్తిగా మారింది. మేజర్ మూవీ ని వెస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూట్ చేసిన సురేష్ షికారు చిత్రానికి మొత్తం ఏపీ హక్కులను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకోవడం విశేషం.