బ్యూటీఫుల్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2022 లో దీపికా పదుకొనె సందడి మాములుగా లేదు. రోజుకో ఫ్యాషన్ ను పరిచయం చేస్తోంది. ఖరీదైన డిజైనర్ వేర్స్ లో మెరిసిపో| తుంది. రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేస్తూ హొయలు ఒలకబోస్తోంది. తాజాగా స్లీవ్ లెస్ ఫ్లోరల్ ఫ్రాక్ ధరించి.. విశాలమైన తన వీపు చూపుతూ కాన్ నగర వీధుల్లో చక్కర్లు కొట్టింది. ఈ ఫోటోలు దీపికా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా.. క్షణాల్లో వైరల్ గా మారాయి. ఈ నెల 18న షురూ అయిన కేన్స్ ఫెస్టివల్ 28 వరకు కొనసాగనుంది. మిగిలిన ఈ రెండ్రోజుల పాటు దీపికా సందడి చేయనుంది. ఫైనల్ పంచ్ అదిరిపోయే ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇక ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది. దీపికా. అంతేకాదు.. టాలీవుడ్ స్టార్ మహేష్, ఎన్టీఆర్ తో కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ.