బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చీరకట్టు అందాలతో మతిపోగొడుతోంది. ఎప్పుడూ లేనిది కొత్తగా తలలో మల్లెపూలు పెట్టుకొని సిగ్గుపడుతూ ఫొటోలకు ఫోజులివ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ 'సాహో' మెరిసింది. స్పెషల్ సాంగ్ చిందేసింది. తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియన్ మూవీ 'విక్రాంత్ రోణ'లోనూ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. 'రా రా రక్కమ్మ' అంటూ ఐటమ్ సాంగ్ లో రెచ్చిపోయింది. ఇటీవలే విడుదల ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే చందంగా రక్కమ్మ సాంగ్ ట్రెండింగ్ లో ఉండగానే.... తలలో మల్లెపూలతో కవ్విస్తూ.. సౌత్ లో మరింత క్రేజ్ సంపాదించుకునే పనిలో పడింది జాక్వెలిన్.