ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై సినిమాలకు సెలవు

cinema |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 11:39 AM

కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ ఇకపై సినిమాలను చేయబోవట్లేదని అధికారిక ప్రకటన చేసారు. తమిళ నాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్. ఇకపై రాజకీయాల్లోనే పూర్తిగా తన సమయం కేటాయించాలని భావించి సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్టుగా ఉదయనిధి పేర్కొన్నారు. 


సినిమా ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఉదయనిధి 2012లో హీరోగా మారి ఒరు కల్ ఒరు కన్నడి ...అనే సినిమాను చేసారు. డెబ్యూటేన్ట్ హీరోగా SIIMA, ఫిలిం అవార్డులను అందుకున్నారు. ఆపై, వరస సినిమాలను చేసుకుంటూ కోలీవుడ్ లో స్టార్ హీరోగా మారారు. తను చేసే మామన్నన్ సినిమానే తన ఆఖరి సినిమాగా ఉదయనిధి పేర్కొన్నారు. ఇకపై తండ్రి బాటలోనే పూర్తిగా రాజకీయ రంగంలో ఎదగాలని, ఒక వైపు సినిమాలు చేస్తూ రాజకీయాలలో కొనసాగటం కష్టంగా ఉందని, అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఉదయనిధి తెలిపారు. పోతే..., ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వంలో ఉదయనిధి MLA గా సేవలనందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com