ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సల్మాన్ ఖాన్‌ని కలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 01:12 PM

గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాధం, గద్దలకొండ గణేష్ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను కలిశారు. డైరెక్టర్ హరీష్ తన ఇన్‌స్టాగ్రామ్ లో సల్మాన్ ఖాన్‌తో దిగిన ఫోటోని పోస్ట్ చేసారు . సల్మాన్ ఖాన్ ని చూడటం జరిగింది. చాలా ఆనందంగా ఆయనతో సమయం గడిపాను. భాయ్ నాకు లైఫ్ టైమ్ మెమరీని అందించినందుకు చాలా ధన్యవాదాలు అంటూ ఫోటోకి కాప్షన్ కూడా ఇచ్చారు ఈ స్టార్ డైరెక్టర్. హరీష్ శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తన తదుపరి సినిమా 'భవదీయుడు భగత్ సింగ్' షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com