మొదట అసిస్టెంట్ దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన గోపీచంద్ మాలినేని తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు బడా దర్శకుల జాబితాలో ఒకరిగా నిలిచాడు. శ్రీహరి హీరోగా నటించిన 'పోలీస్' సినిమాకు సహాయ దర్శకుడిగా సినీబీవితాన్ని ప్రారంభించిన గోపిచంద్, శ్రీహరి నటించిన నాలుగు సినిమాలకు పనిచేశాడు.అనంతరం ఇవివి సత్యనారాయణ దగ్గర రెండు సినిమాలకు, శ్రీను వైట్ల దగ్గర 'అందరివాడు', 'వెంకీ', 'ఢీ' సినిమాలకు, మురుగ దాస్ దగ్గర 'స్టాలిన్' సినిమాకు, శ్రీవాస్ దగ్గర 'లక్ష్యం' సినిమాకు మరియు మెహర్ రమేష్ దగ్గర 'కంత్రి', 'బిల్లా' సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.
రవితేజ 'డాన్ శ్రీను' సినిమాతో గోపీచంద్ మొదట దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తర్వాత బలుపు, బాడీగార్డ్ సినిమాలతో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మాలినేని మాస్ మహారాజ్ రవితేజతో 'క్రాక్' సినిమా చేస్తున్నారు. ఇలాగే మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటూ గోపీచంద్ కి జన్మదిన శుభాకాంక్షలు.