ఏపీలో నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి జనవరి 1 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. టెట్ ఫీజు చెల్లించేందుకు డిసెంబర్ 30 వరకు అవకాశం కల్పించనున్నారు. జనవరి 17 నుంచి 27 వరకు ఏపీ టెట్ నిర్వహించనున్నారు. జనవరి 8 నుంచి వెబ్సైట్లో నమూనా పరీక్షలు, జనవరి 9 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్కు అవకాశం కల్పించనున్నారు. జనవరి 29న ప్రాథమిక కీ విడుదల, ఫిబ్రవరి 6న తుది కీ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 8న టెట్ ఫలితాలను విడుదల చేస్తారు.