ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళిత+బహుజన విద్యార్థులను వాడుకుంటున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 01:48 AM

 -నైజాం రాజ్యం అంతమై ఈ నెల 17 నాటికి 24,990 రోజులు


 -ఇందులో 1,291 రోజులు ఎస్సీ, బీసీ ముఖ్యమంు్తల్రు 


 -కాగా 23,609 రోజులు అగ్రకులాలదే పాలన


 -10 శాతం ఉన్న అగ్రకులాలు 95 శాతం కాలం పాలన


 -90 శాతం ఉన్న వెనుకబడిన కులాలకు 10 శాతం కాలం దొరికింది


``కోదండరాముడంట కొమ్మలాలో..... వాడు కౌసల్య పుత్రుడంట అమ్మాలాలో...'' అనే సినిమా పాట రాముడి ప్రాశస్తా్యన్ని, నిబద్దతను ఎంతో గొప్పగా లోకానికి చెబుతుంది. తెలంగాణ ఉద్యమం మూలంగా దాదాపు అంతేస్థాయి ఆదరణను, ఔదార్యాన్ని పొందిన వ్యక్తి ప్రొఫెసర్‌ కోదండరాం. ఆయనను ప్రత్యామ్నాయ రాజకీయాలకు సరైన వ్యక్తి అని తెలంగాణ ప్రజానీకం భావిస్తున్న తరుణం, ఉద్యోగాలు లేక నిస్పృహకు గురైన నిరుద్యోగులతో భారీ సభ ఏర్పాటు, టిఆర్‌ఎస్‌ శ్రేణుల బలమైన విమర్శల నేపథ్యాలలో ఈ వ్యాసం రాష్ట్ర భవిష్యత్‌ రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని కూడా చూపనుంది. ఏది ఏమైనా నిగూఢమైన సత్యాలను వెలికితీస్తూ ్ర„పశ్నించే ధోరణిని పెంచే వాదన ఏదైనా సరైనదే. కోదండరాం చుట్టూ రెడ్ల పరిభ్రమణం మొదలైంది. అందుకనే ఆయన పట్ల దళిత-బహుజనులకు ఉన్న భ్రమలను పటాపంచలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. జేఏసీ చైర్మన్‌గా ఆయన ఎన్నిక కూడా ప్రజాస్వామ్యబద్దమైంది కాదు ఎందుకంటే ఆయనను ఎవరూ ఎన్నుకోలేదు. ప్రజా సంఘాల, మేధావుల, ఉద్యమకారుల అభిప్రాయానై్ననా పరిగణనలోకి తీసుకోకుండా కేసీఆర్‌, జానారెడ్డి కలిసి ఆయన పేరును అమాంతంగా తెరపైకి తెచ్చారు. రాజనీతిశాస్త్రం బోధించే ఈ ప్రొఫెసర్‌ ఆయన ఎన్నికను ఆత్మవిమర్శ చేసుకోకుండా సమర్ధించుకున్నారు. దాదాపు ఐదారు సంవత్సరాలుగా ఆ హోదాలో కొనసాగుతున్నారు. ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో కేసీఆర్‌ కోదండరాంల మధ్య తీవ్రమైన బేధాభిప్రాయాలు వచ్చాయని ప్రజలందరూ భావిస్తున్నారు. ఈ విషయంపై నేటి వరకు కూడా కోదండరాం పెదవి విప్పలేదు. దళితుడే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని పలుమార్లు ఉద్ఘాటించిన కేసీఆర్‌, ఆ మాటను తప్పినప్పుడు కోదండరాం కనీసం విమర్శ చేయలేదు. ఒకవేళ విమర్శ చేసి ఉంటే తాను గానీ, తన సామాజిక వర్గం గానీ భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశానికి అదే మాట అడ్డంగా మారుతుందని ఆనాడే ఊహించాడు. అందుకనే మౌనం పాటించాడు. స్వామి కార్యం, స్వకార్యం రెండూ అయిపోయాయి. నిందను కేసీఆర్‌ మోసినా...అగ్రకులాలకు లైన్‌ క్లియరైంది. అంబేద్కర్‌ చిన్న రాషా్టల్రను సమర్ధిస్తూ వీటి ద్వారానే బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుందని సిద్ధాంతపరంగా సూత్రీకరించినప్పటికీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కసారి కూడా అంబేద్కర్‌ పేరును కోదండరాం ఉచ్ఛరించిన దాఖలాలు లేవు. నాడు మాట్లాడకపోవడం, నేడు గంటల తరబడి అంబేద్కర్‌ యొక్క సామాజిక వాదాన్ని మాట్లాడటం చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. ఆనాడు సామాజిక తెలంగాణ కోసం పాటుపడిన సంఘాలను, మేధావులను కోదండరాం కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే వారు ఆయనను విభేదించి అణగారిన కులాల జాక్‌ను ఏర్పాటు చేశారు. అగ్రకులాలు నాయకత్వం వహించిన రాజకీయ జేఏసీ పొందిన ప్రాచుర్యం అణగారిన కులాల జాక్‌ పొందలేదు. కానీ సుదీర్ఘ కాలంగా ప్రజాస్వామ్య, సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములు అయిన మెజారిటీ సంఘాల నాయకులు, మేధావులు సామాజికవాదంతోనే ఉన్నారు. శ్రీకృ„ష్ణ కమిటీ సైతం వారినే గుర్తించింది. కమిటీ రిపోర్టులో వారిని కోట్‌ చేసింది కానీ కోదండరాంను కాదు. ఇంతటి ప్రతిభ కలిగిన దళిత-బహుజన మేధావులతో కోదండరాం నాడు కానీ, నేడు కానీ ఎందుకు చేతులు కలపడం లేదు? విభేదాలతో నిరంతరం ప్రచ్ఛన్న యుద్ధం జరుపుతూనే అగ్రవర్ణ నాయకులైన కేసీఆర్‌, జానారెడ్డి, జైపాల్‌రెడ్డిలతో నాడు జతకట్టి నడిచాడు. ఒకవేళ కోదండరాం ఆనాడు అణగారిన కులాల పక్షాన మాట్లాడి ఉంటే నేటి పరిస్థితి మరోరకంగా చేతులు కాలినంక ఆకులు పట్టుకున్న చందంగా నేడు ఆయన సామాజిక వాదమే శరణ్యమనడం విడ్డూరంగా ఉంది. ఆంధ్రా వలసవాద దోపిడీని శతృవుగా చూపిస్తూ ఒక సామాజికవర్గం అధికారంలోకి వస్తే, సామాజిక తెలంగాణను ఎరగా చూపిస్తూ మరొక అగ్రవర్ణం అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుందని స్పష్టమైంది. ఈ తతంగానికి దళిత-బహుజన విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వాలైంది నిమ్నకులాలకు చెందిన కవులు, కళాకారులు, విద్యార్థులే అన్నది జగమెరిగిన సత్యం. బలిదానాలు కూడా వారివే ఎక్కువ. ఒకవైపు ఉద్యమం ఉధృతంగా నడుస్తుంటే, అధికశాతం అగ్రవర్ణాల పిల్లలు అమెరికా దేశాల్లో వారి చదువుల్లో, కొలువుల్లో మునిగిపోయి ప్రత్యక్ష ఉద్యమానికి దూరంగా ఉన్నారు. పెద్ద చదువులను నాణ్యమైన యూనివర్సిటీలలో శాస్త్రీయ దృక్పథంలో చదివిన ఈ అగ్రకుల విద్యార్ధులెవ్వరు కూడా సామాజిక తెలంగాణకు మద్దతు పలకలేదు. పైగా నేడు నిరుద్యోగ సమస్యను అధిగమించి కార్పొరేట్‌ ఉద్యోగాలలో కొలువుదీరారు. మరొకవైపు తీవ్రపోరాటం చేసిన తెలంగాణ గ్రామీణ బడుగు, బలహీన విద్యార్ధులు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక ప్రైవేటు ఉద్యాలకు సరిపడే స్కిల్‌ లేక తీవ్రమైన నిరుద్యోగ సమస్యలోకి నెట్టబడ్డారు. లక్ష ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్‌ మాట్లాడుతుంటే నమ్మి ఉద్యమంలో వచ్చారు. ఆనాడు కేసీఆర్‌ మాట్లాడిన సభలకు హాజరైన కోదండరాం కూడా ఈ లక్ష ఉద్యోగాలు సాధ్యమవుతాయని గానీ, కావనిగానీ చెప్పలేదు. పైగా ఆయన కేసీఆర్‌ వంతపాడుతున్నట్లుగానే ప్రవర్తించాడు. నిజమైన మేధావికి ప్రభుత్వరంగం ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుందో ఆనాడు ఒక అంచనా కోదండరాంకు లేదంటే ఎవరూ నమ్మలేరు. కానీ వీరిరువురు ఉస్మానియా కేంద్రంగా ఉన్న విద్యార్ధులను నౌకర్ల నెపంతో పాచికలు చేసుకొని ఉద్యమాన్ని నడిపారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఒక ఆత్మగౌరవ ఉద్యమం ఎందుకంటే ఆనాడే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లక్ష నౌకర్లు ఇచ్చినా మనం తెలంగాణ కోసం పోరాడేవారిమే. అంటే నౌకర్లకన్నా ఆత్మగౌరవం, అభివృద్ధి, అధికారం ముఖ్యం. 


నైజాం రాజ్యం అంతమై ఈ నెల 17 నాటికి 24,990 రోజులు అవుతుంది. ఇందులో 1,291 రోజులు ఎస్సీ, బీసీ ముఖ్యమంత్రులు కాలం కాగా, 23,609 అగ్రకులావే. 10 శాతం ఉన్న అగ్రకులాలు 95 శాతం కాలం పాలన చేయగా కేవలం 5 శాతం కాలం 90 శాతం ఉన్న వెనుకబడిన కులాలకు దొరికింది. `పొలిటికల్‌ పవర్‌ ఈజ్‌ మాస్టర్‌ కీ' అని అంబేద్కర్‌ చెప్పినట్లు కోదండరాం రాజ్యాధికారం గురించి కాకుండా నిస్సహాయులైన నిరుద్యోగులను టార్గెట్‌గా చేసుకుని కొలువుల కోసం పురికొల్పుతున్నారు. వాస్తవానికి లక్ష ఉద్యోగాలు ఇచ్చినా తెలంగాణ దళిత-బహుజనుల జీవితాలు మారవు. మారుమూల గ్రామాల్లో అట్రాసిటీలు, వివక్షలు సమపిసోవు. రాజ్యాధికారమే సమాజంలో సమగ్రమార్పును తీసుకొస్తుంది. అందుకొని సమరం కేవలం ప్రభుత్వ ఉద్యోగాల మీద కాకుండా నాణ్యమైన విద్య, వైద్యం ఉపాధిలతో పాటు రాజ్యాధికారంపై ప్రధానంగా జరగాల్సి ఉంది. ఎలాగూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ తగ్గుతుంది కాబట్టి కొద్దిపాటి వ్యయప్రయాసలతో ఎత్తుగడలనే ప్రధాన హేతువులుగా చేస్తూ రాజ్యాధికారాన్ని పొందాలనే కోదండరాం వ్యూహం ఒక కుట్రతో సమానమైంది. నిజంగా సమగ్రమార్పుకి ఆయన పాటుపడాలనుకుంటే తరతరాలుగా అణచివేయబడ్డ కులాలతో జతకట్టి వారి సాధికారతకు పాటుపడాల్సిన అవసరం ఉంది.సిద్ధాంత భూమికలేని పాపులరిస్టుకు ఉద్యమాలకు ఊతమిచ్చి దళిత-బహుజన సిద్ధాంతానికి తూట్లు పొడవద్దు. సిద్ధాంతం లేని జీవితాలు రాద్ధాంతమవుతాయి. అర్థాంతరంగా ముగిసిపోతాయి. కనుక పూలే అంబేద్కరిజాన్ని నమ్ముకుందాం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com