ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న…రేగా నిధులతో సుసంపన్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 01:43 AM

 -సుస్థిర ఆస్తులే సృష్టికి మార్గం


 -పల్లెవనం కార్యక్రమానికి శ్రీకారం


 -ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం


  అమరావతి నుంచి సూర్య ప్రతినిధి: నరేగా నిధులను ప్రతి శాఖ అవకాశం ఉన్నంత మేరకు సమర్ధవంతంగా, జవాబుదారీతనం ఉండేలా వినియోగిం చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు అధికారులకు చెప్పారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 6 వేల కోట్ల వరకు నరేగా నిధులు ఖర్చు పెట్టగాలి గామని, రానున్న ఆర్ధిక సంవత్సరంలో ఇంతకు మించి రూ. 7,200 కోట్ల నిధులును సద్వినియోగ పరుచుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. నరేగా నిధు లను కేంద్రీకరించి, వినియోగించే అంశంపై ముఖ్యమంత్రి గురువారం సచివా లయంలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.  నరేగా నిధులతో కేవలం ఒకొక్కరికి ఏడాదికి కనీసం 100 రోజులు, కరువు సమయంలో 150 రోజుల పనిదినాలు తగ్గకుండా ఉపాధి కల్పించే పథకంగా చూడొద్దని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెద్దఎత్తున ఏర్పాటు చేయడం, స్థిర ఆస్తులు స ష్టించడం, పేదలకు మెరుగైన జీవన వనరులు సమకూర్చడం, పంచాయతీరాజ్‌ సంస్థలను బలోపేతం చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలు నరేగా నిధులతో సాధ్యమవుతాయని అన్నారు. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో 4 లక్షల పంట సంజీవని కుంటలు ఏర్పాటు చేయడంతో పాటు, 2 లక్షల వర్మి కంపోస్‌‌ట యూనిట్లు నెలకొల్పాలని అన్నారు. అలాగే 3 వేల కిలోమీటర్ల పొడవునా రహదారుల వెంబడి మొక్కల పెంచాలని, 4 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాల నిర్మించాలని చెప్పారు. 6 వేల కిలోమీటర్ల వరకు సీసీ రోడ్లు వేయాలని, రెండున్నర లక్షల ఇళ్లు- 70 మినీ స్టేడియాల నిర్మాణం లక్ష్యాలను ముందుంచారు.  రాష్ర్టంలోని 90 లక్షల మంది డ్వాక్రా సభ్యులను భాగస్వాము లను చేసేలా నరేగా నిధుల వినియోగించి  ఉపాధి కార్యక్రమాలను చేపడితే ప్రతి కుటుంబానికి నెలకు ఖచ్చితంగా రూ. 10 వేల ఆదాయం వచ్చేందుకు వీలు కలుగు తుందని ముఖ్యమంత్రి అన్నారు.  వ్యవసా యంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గేలా చూడాలని, వర్మి కంపోస్‌‌ట ను భారీఎత్తున తయారు చేసేందుకు ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయ - ఉద్యానవన, సంక్షేమ, పంచాయతీరాజ్‌ శాఖలు, సెర్‌‌ప సమన్వయంతో పనిచేసి వర్మి కంపోస్‌‌ట తయారీ, సరఫరాకు సంబంధించి సమ గ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. నరేగా నిధులతో చేపట్టే అభి వృద్ధి కార్యక్ర మాలతో సంపద సృష్టి జరగాలని ముఖ్యమంత్రి అభిలషించారు. నరేగా కింద చేపట్టే పనులకు నిధుల కోసం ఎదురు చూడకుండా ఆయా శాఖలు తమ సొంత నిధులను ముందుగా వినియోగించి, తర్వాత సర్దుబాటు చేసుకోవాలని చెప్పారు. ప్రతి శాఖ నరేగా నిధుల వినియోగంపై నిర్ధిష్ట లక్ష్యా లను కలిగి వుండాలన్నారు. పల్లెలకు చెట్లే పట్టుకొమ్మలని, పల్లె పచ్చగా వుంటేనే అందరికీ నీడ వుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. నగరవనాల స్ఫూర్తిగా `పల్లెవనం' పేరుతో గ్రామాల్లో విస్తతస్థాయిలో మొక్కలు నాటి పెంచే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పారు. నరేగా నిధుల కింద మొక్కల పెంపకాన్ని చేపట్టి అటు ఉపాధి, ఇటు పచ్చదనం పెంపొందించాలని అన్నారు. అటవీ భూములు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, రహదారులకు ఇరువైపులా నరేగా నిధులతో మొక్కలు పెంచడంపై దృష్టి పెట్టాలని ముఖ్య మంత్రి సూచించారు. 


  ఉద్యానవనశాఖ అత్యధిక ఫలితాలు సాధిస్తే పర్యావర ణానికి మేలు చేకూరడమే కాకుండా, రైతులు అధిక ఆదాయాన్ని ఆర్జించేందుకు ఎక్కువ అవకాశం వుంటుం దని అన్నారు. రాష్ర్టంలో 50 శాతం గ్రీన్‌ ఫీల్‌‌డ లక్ష్య సాధనలో ఉద్యానవనశాఖ ప్రధాన పాత్ర పోషించాలని చెప్పారు. మహాత్మాగాంధీజీ 150వ జయంతి సందరేంగా కేంద్ర ప్రభుత్వం మిషన్‌ అంత్యోదయ కింద 2019 నాటికి 50 వేల గ్రామ పంచాయతీలను పేదరిక రహితంగా చేసేందుకు నిర్దేశించుకుందని, అయితే ఇందులో మనమే ముందుండాలని చెప్పారు. ఈ సమీక్షలో మం్తల్రు పల్లె రఘునాధరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, కిమిడి మణాళిని, కామినేని శ్రీనివాస్‌, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సతీష్‌ చంద్ర, అజయ్‌ కల్లం, ఏకే ఫరేడా, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శులు రాజమౌళి, ప్రద్యుమ్న, స్వచాేంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ సీఎల్‌ వెంకట్రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, వీడియో కాన్ఫరెన్‌‌స  ద్వారా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com