ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్ కు రామ్ చరణ్ ఆర్థిక సాయం...ఎందుకో తెలుసా

national |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 05:39 PM

ఉక్రెయిన్ దేశస్థుడిగా హీరో రామ్ చరణ్ ఆర్థికంగా సహాయం చేసి ఆదుకొన్నాడు. ఎందుకు తెలుసా...? ఉక్రెయిన్ ప్రస్తుతం రష్యా దాడులతో తల్లడిల్లిపోతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ తన మంచి మనసు చాటుకున్నారు. రస్టీ అనే ఉక్రెయిన్ వ్యక్తికి డబ్బు పంపించి మానవతా దృక్పథాన్ని ప్రదర్శించారు. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోనూ షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో రామ్ చరణ్ కు రస్టీ బాడీగార్డుగా వ్యవహరించాడు. రష్యా సైనికచర్యతో ఉక్రెయిన్ లో పౌర జీవనం దారుణంగా మారిందన్న వార్తలతో రామ్ చరణ్ ఆందోళన చెందారు. వెంటనే రస్టీతో ఫోన్ లో మాట్లాడి, వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రస్టీ తండ్రి 80 ఏళ్ల వయసులోనూ తుపాకీ పట్టి దేశం కోసం పోరాడుతున్న తీరు పట్ల చలించిపోయారు. రస్టీకి ఆర్థికసాయం చేయగా, ఆ డబ్బుతో అత్యవసర ఔషధాలు కొనుక్కున్నట్టు రస్టీ ఓ వీడియోలో వెల్లడించాడు. రామ్ చరణ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com