ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్ చిన్నారుల కోసం ఫెదరర్ భారీ విరాళం

international |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 05:00 PM

ఉక్రెయిన్‌‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా భీకరంగా బాంబుల వర్షం కురిపిస్తోంది. తాజాగా సూపర్ సోనిక్ మిసైళ్లను ప్రయోగిస్తోంది. యుద్ధ నియమాలకు విరుద్ధంగా జనావాసాలు, ఆసుపత్రులు, చర్చిలపై బాంబులతో విధ్వంసం సృష్టిస్తోంది. ఫలితంగా వందల సంఖ్యలో చిన్నారులు, మహిళలు మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో వారికి బాసటగా నిలిచేందుకు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ ముందుకు వచ్చాడు. ఉక్రెయిన్ చిన్నారులు విద్యా, వసతుల కోసం ఏకంగా 5 లక్షల స్విస్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించాడు. ఉక్రెయిన్‌లో చిన్నారుల దైన్యంపై కొన్ని ఫొటోలు చూసి తాను చలించిపోయానన్నారు. తన వంతు సాయంగా విరాళం ప్రకటించినట్లు ట్విట్టర్‌లో తెలిపారు. దీనిపై ఆయన అందించిన సాయాన్ని కొనియాడుతూ నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. రష్యా దాడుల్లో పెద్ద సంఖ్యలో భవనాలు చిధ్రమయ్యాయి. ఎంతో అందంగా కనిపించే పర్యాటక ప్రాంతాలు స్మశానంగా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com