చింతకొమ్మదిన్నె మండలం రాయచోటి రోడ్డు లోని మూలవంక బ్రిడ్జి వద్ద గల పెట్రోల్ బంకు సమీపంలో నిలబడి ఉన్న లారీని టిప్పర్ ఢీ కొట్టినది. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో టిప్పర్ లో ఇరుక్కపోయిన డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న పోలీస్, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరిక జెసిబి సాయంతో డ్రైవర్ ను వెళికి తీశారు. క్షతగాత్రున్ని 108లో రిమ్స్ కు తరలించారు.