ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొడవలకు పాల్పడితే చర్యలు తప్పవు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 09:28 AM

గ్రామాల్లో ఎటువంటి ముఠా కక్షలకు, గొడవలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి పేర్కొన్నారు. పెండ్లిమర్రి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎటువంటి గొడవలకు పోకుండా సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. ముఠా కక్షల వల్ల భవిష్యత్తు అంధకారంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు,


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com