ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) ఖరగ్‌పూర్.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఫలితాలు నేడు (మార్చి 17) విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సూట్ gate.iitkgpలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన స్కోర్‌కార్డులను మార్చి 21 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రోల్ నంబర్, పాస్‌వర్డ్ లేదా ఈ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. గేట్ ఫలితాలతో పాటు ఆన్సర్ కీని కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది ఐఐటీ ఖరగ్‌పూర్. కాగా గేట్ 2022 పరీక్ష ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగింది. వీటికి సంబంధించిన ఫలితాలు ఐఐటీ ఖరగ్‌పూర్ నేడు విడుదల చేయనుంది. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) పరీక్ష ఇంజనీరింగ్, సైన్స్‌లోని వివిధ అండర్ గ్రాడ్యుయేట్ సబ్జెక్టుల్లో పీజీ ప్రవేశాలకు ప్రతి ఏడాది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో రిక్రూట్‌మెంట్లకు కూడా గేట్ స్కోర్ ఉపయోగపడుతుంది.