ఆంధ్రప్రదేశ్ లో 6,16,689 మంది నిరుద్యోగులు ఉన్నట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 1,94,634 మంది మహిళలు ఉండగా... 4,22,055 మంది పురుషులు ఉన్నారు. టీడీపీ సభ్యులు ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, మంతెన రామరాజులు శాసనసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో అత్యధికంగా విజయనగరం జిల్లాలో నిరుద్యోగులు ఉన్నారు. కర్నూలు జిల్లాలో 64,294 మంది, కడప జిల్లాలో 58,837 మంది ఉన్నారు. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా 18,730 మంది నిరుద్యోగులు ఉన్నారు. అయితే వీరందరూ ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్నవారు మాత్రమే కావడం గమనార్హం.