ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో మరోసారి పెరుగుతున్న కొవిడ్ కేసులు

international |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 10:15 AM

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి. అమెరికాలోని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాల్లో ఈ నెల 1 నుంచి 10 వతేదీ మధ్య చేపట్టిన వైరస్  నిర్ధరణ పరీక్షలను ఆధారంగా... పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు బ్లూమ్ బర్గ్  సంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్  వేరియంట్  క్షీణదశలోకి చేరిన ఫిబ్రవరి 1 నుంచి 10 మధ్య నమోదైన కేసులతో పోలీస్తే.. ప్రస్తుతం వాటికి రెండు రెట్లు అధికంగా కొత్త కేసులు నమోదవుతున్నట్లు తెలిపింది. కేసుల పెరుగుదలను చూస్తే మరోదశ మహమ్మారి విజృంభించే అవకాశం లేకపోలేదని హెచ్చరించింది.ప్రస్తుతం కొవిడ్ నిబంధనలను సడలించడం, ఎక్కువ సంఖ్యలో ప్రజలు కార్యాలయాలకు హాజరవుతుండడంతో.... వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్లు అంచనా వేసింది. మార్చి 1 నుంచి 10 మధ్య ఎక్కువ సంఖ్యలో ప్రజలు మహమ్మారి బారిన పడినట్లు తెలిపింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com