ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈమె అడుగుపెట్టిన ప్రతి చోట గెలుపే..

national |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 10:58 AM

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బీజేపీ విజయం సాధించింది. రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం అవుతున్నది. అయితే, ఏడు దశల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఆఖరిక్షణంలో బరిలోకి దూకడం ఆమె పార్టీకి కాస్త కలిసొచ్చిందనే చెప్పాలి.కానీ.. ఒక్క సీటు మినహా ఆమె ప్రచారం చేసిన ప్రతిచోటా ఎస్పీ విజయ భావుటా ఎగురవేసింది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పోటీ చేసిన సిరాథులో ఎస్పీ అభ్యర్థి పల్లవి పటేల్‌కు మద్దతుగా జరిగిన సభలో సీఎంగా యోగి కాషాయ దుస్తులపై డింపుల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. వార్తల్లో పతాకశీర్షికలకు ఎక్కాయి.


సిరాథులో కేపీ మౌర్యకు మద్దతుగా యావత్ బీజేపీ యంత్రాంగం ప్రచార బరిలోకి దిగింది. కానీ డింపుల్ యాదవ్ ప్రచారం దరిమిలా ఓట్ల లెక్కింపులో పల్లవి పటేల్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చారు. ఇక 2005లో హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే రాజు పాల్ భార్య పూజాపాల్‌.. కౌశాంబిలోని చైల్ స్థానంలో పోటీ చేశారు. అప్నాదళ్ (ఎస్‌) అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్‌సింగ్ పటేల్‌పై బరిలోకి దిగిన పూజాపాల్‌కు మద్దతుగా డింపుల్ ప్రచారం చేశారు దీంతో దాదాపు 13 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు పూజాపాల్‌. మంజాన్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి లాల్ బహదూర్‌పై పోటీ చేసిన ఇందర్‌జిత్ సరోజ్‌కు మద్దతుగా ఒక ఎన్నికలసభలో డింపుల్ పాల్గొన్నారు. లాల్‌బహదూర్ సభల్లో ఆయన ప్రసంగాలు ఆసక్తిగా విన్నా.. ఫలితాలు మాత్రం తిరగబడ్డాయి. రమారమీ 25 వేల ఓట్ల మెజారిటీతో ఇందర్‌జిత్ సరోజ్ విజయం సాధించారు.మాదియాహులో బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ (సోనేలాల్‌) అభ్యర్థి డాక్టర్ ఆర్కే పటేల్‌పై ఎస్పీ అభ్యర్థి సుష్మా పటేల్ కేవలం 1206 ఓట్ల తేడాతో ఓడిపోయారు. పోటాపోటీ జరిగిన ఈ ఎన్నికలో డింపుల్ కేవలం ఒక సభలో మాత్రమే పాల్గొన్నారు. ఆర్కే పటేల్‌కు 76007 ఓట్లు లభిస్తే, సుష్మా పటేల్‌కు 74,801 ఓట్లు వచ్చాయి. మచిలిషహర్‌లో పోటీ చేసిన డాక్టర్ రాగిణికి మద్దతుగా చేసిన డింపుల్ ప్రచారం లాభించింది. రాగిణికి 91,659 ఓట్లు రాగా, బీజేపీ ప్రత్యర్థి 83,175 ఓట్లు మాత్రమే వచ్చాయి.


 


చివరి దశల్లో పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో మాత్రమే డింపుల్ యాదవ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఐదో దశ పోలింగ్ వరకు ఆమె ప్రచారానికి దూరంగా ఉన్నారు. 2017లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో డింపుల్ యాదవ్ మాట్లాడుతున్నప్పుడు కార్యకర్తలు అసభ్యకర నినాదాలు చేశారు. దీంతో ఆమె మధ్యలోనే వెళ్లిపోయారు. అప్పటి నుంచి డింపుల్ యాదవ్‌తోపాటు అఖిలేశ్ యాదవ్ ప్రచారంలో పాల్గొనే వారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో చివరి క్షణంలో మాత్రమే ప్రచారకర్తగా ఆమె పేరు రిలీజ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com