ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్జీనియా స్టేట్ యూనివర్శిటీలో కాల్పుల కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 15, 2017, 10:26 AM

వర్జీనియా స్టేట్ యూనివర్శిటీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఒంటరిగా సాయుధుడై వచ్చిన ఓ యువకుడు కాల్పులకు దిగినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి 8.35 (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7.05) గంటల సమయంలో కాల్పులు జరుగగా, దుండగుడు ఇంకా వర్శిటీ ప్రాంగణంలోనే ఉన్నాడని తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా వర్శిటీని మూసివేసిన అధికారులు, అక్కడ ఎవరూ ఉండవద్దని, విద్యార్థులంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. వర్శిటీ లోపలికి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. కాల్పుల ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయని, అతనికి ప్రాణాపాయం లేదని చెస్టర్ ఫీల్డ్ పోలీసు విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. క్యాంపస్ కు ప్రమాదం ఏమీ లేకపోయినప్పటికీ, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని తెలిపింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి వుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com