ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 01:51 PM

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు అలర్ట్. మరో రెండ్రోజుల్లో ప్రారంభం కావల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి.ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12వ తేదీ వరకూ జరగనున్నాయి. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కావల్సిన పరీక్షలు..జేఈఈ మెయిన్స్ పరీక్ష తేదీల కారణంగా వాయిదా పడ్డాయి. మరో రెండ్రోజుల్లో అంటే మార్చ్ 11 నుంచి ఇంటర్నీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విడుదల చేసింది. ఈ హాల్ టికెట్లను చాలా సులభంగా ఇంట్లోనే కూర్చుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే..


ముందుగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్‌పేజ్‌లో Download Practical Hall Tickets March 2022 పై క్లిక్ చేసిన తరువాత మరో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్‌కు సంబంధించిన రోల్ నెంబర్ లేదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత Download Hall Ticketపై క్లిక్ చేసి..ప్రింట్ తీసుకుంటే చాలు. ఇంటర్మీడియట్ విద్యార్ధుల రోల్ నెంబర్‌ను కళాశాల నుంచి పొందాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు నెంబర్‌తో కూడా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరిగే మెయిన్ పరీక్షల హాల్ టికెట్లు వేరుగా ఉంటాయి. అవి త్వరలో విడుదల కానున్నాయి. ఇవి కూడా ఇదే వెబ్‌సైట్ నుంచి ఇదే పద్ధతిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com