ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో పవన్ కల్యాణ్ పేరు మార్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2017, 12:38 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు మార్చుకున్నాడా? అన్న అనుమానం గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఆయన పేరు టైప్ చేసిన వారందరికీ కలుగుతోంది. పవన్ కల్యాణ్ పేరు గూగుల్ సెర్చ్ ఇంజన్ లో టైప్ చేసిన వెంటనే కుడిచేతివైపు ఆయన వికీపీడియా కనిపించే దగ్గర కుశాల్ బాబు అని కనిపిస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ తన పేరు ఎప్పుడు మార్చుకున్నాడని అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రధానంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తల్లో అయోమయం పెరిగిపోయింది. జనసేన కార్యాలయాన్ని సంప్రదించగా అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు. అయితే ఈ పేరు పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న సినిమాలో అతను ధరించే పాత్రపేరా? అన్నది తెలియాల్సి ఉంది. పవన్ కల్యాణ్ కు సంబంధించిన వివరాలన్నీ సరిగ్గా చూపిస్తున్న గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేవలం పవన్ పేరునే కుశాల్ బాబుగా ఎందుకు చూపిస్తోందని పలువురు వీరాభిమానులు జట్టుపీక్కుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com