దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-1 ప్రాంతంలో ఓ రోడ్డు ప్రమాదంలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఓ యువకుడిని అరెస్టు చేశారు. అతడికి ఆశ్రయం ఇచ్చిన నేరంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన నిందితుడి తండ్రి చేతులకూ బేడీలు వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఓ ప్రముఖ యూనివర్సిటీలో లా చదువుతున్న 27 ఏళ్ల రాజ్ సుందరం తాను కొత్తగా కొనుగోలు చేసిన ఫోక్స్‌వ్యాగన్ కారును మంగళవారం అతి వేగంతో నడిపాడు. ఓ యువకుడిని తన కారుతో గుద్దేసి, దాదాపు 200 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని కనుగొన్నారు. దాని ద్వారా నిందితుడి వివరాలపై ఆరా తీశారు. వివిధ సెక్షన్ల క్రింత కేసులు నమోదు చేశారు. గాలింపు చేపట్టి, గురుగ్రామ్‌లోని మెరిడియన్ హోటల్ వద్ద నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. అతడికి ఆశ్రయం ఇచ్చాడనే నెపంతో నిందితుడి తండ్రిపైనా కేసులు పెట్టి, కటకటాల్లోకి పంపారు. బాధితుడైన ఆనంద్ విజయ్ మాండెలియా తీవ్రగాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
![]() |
![]() |