వైఎస్ఆర్ కడప: లక్కీరెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గుట్కా విక్రయాలపై శుక్రవారం పోలీసుల దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు. రూ. 15 వేల విలువైన 1500 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్టుచేసినట్లు తెలిపారు. గుట్కా విక్రయాలు చేసినట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.