విశాఖపట్నం: పంజాబ్ హోటల్ కూడలి జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పించి. ఘటనకు సంబందించి కంచరపాలెం ట్రాఫిక్ ఎస్. ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో బిర్లా కూడలి జాతీయ రహదారి మీదుగా ఎన్. ఏడీ వైపు వెళ్తున్న కారు ను అటుగా వెళ్తున్న లారీ బలంగా ఢీకొంది. ప్రమాద సమయంలో లారీ అపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు వెంబడించి ఎన్. ఎస్. టి. ఎల్ కూడలి వద్ద లారీని అడ్డుకున్నారు. ప్రమాదంలో కారు పాక్షికంగా దెబ్బతిన్నది. కారు రహదారి వద్ద నిలిచిపొవడంతో కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు క్రైన్ సహయంతో కారును తొలగించారు.
![]() |
![]() |