ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వన్ టైం సెటిల్మెంట్ నిరుపేదల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, దీని ద్వారా అర్హులైన లబ్ధిదారులకు శాశ్వత గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సఖినేటిపల్లి ఎంపిడిఒ జి.భీమారావు పేర్కొన్నారు. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందివ్వాలనే సదుద్దేశ్యంతోనే క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓటీఎస్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా లబ్ధిదారులకు వివరించాలని ఆయన సూచించారు.