రామ్గోపాల్ వర్మను `అర్జున్ రెడ్డి` హీరో విజయ్ దేవరకొండ కలిశారు. ఆ సమయంలో తన కండలు చూపించినందుకు విజయ్ నవ్వాడని ఆర్జీవీ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అంతే కాకుండా వారు కలిసిన హోటల్లో దిగిన ఫొటోను కూడా ఆర్జీవీ షేర్ చేశాడు. విజయ్ సెల్ఫీ తీస్తుండగా, ఆర్జీవీ తన కండలు చూపిస్తుండటం, పక్కనే ఒక అమ్మాయి. ఆ ఫొటోలో కనిపిస్తోంది. `అర్జున్ రెడ్డి` విషయంలో ఆర్జీవీ మద్దతు పలికినందుకు తనను తప్పకుండా కలుస్తానని విజయ్ చెప్పిన సంగతి తెలిసిందే.