ఏపీని వర్షాలు వదిలేలా లేవు. మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం పశ్చిమ బెంగాల్ – బంగ్లాదేశ్ తీర ప్రాంతం మరియు దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతము మీద ఉంది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరకోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మూడు ప్రాంతాల్లో ఈ రోజు మరియు రేపు, తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతాతవరణ శాఖ తెలిపింది.