ప్రకాశం: కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని ఏడవ వార్డు కొత్తూరు నందు లారీ కింద పడి మోటార్ సైకిల్ పై వస్తున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పామూరు నుండి కనిగిరి కి మోటార్ సైకిల్ పై వస్తున్న వ్యక్తి కొత్తూరు సమీపంలో రోడ్డుపై గుంతలు ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి వెనకనున్న లారీ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రాథమిక వివరాలు తెలియవలసి ఉంది.