ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటివరకు 30 దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచం మళ్లీ భయం గుప్పిట్లోకి జారుకుంటోంది. రోజుల వ్యవధిలోనే ఈ కొత్త వేరియంట్ పలు దేశాలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ కరోనా కొత్త వేరియంట్ పై వ్యాక్సిన్ లు ఎంత వరకు ప్రభావం చూపగలుగుతాయనే అంశంపై సైంటిఫిక్ గా ఇంకా స్పష్టత లేదు. కానీ, ఈ కొత్త వేరియంట్ ముప్పు నుండి వ్యాక్సిన్ మాత్రమే మనల్ని రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వ్యాక్సిన్ లు 'ఒమిక్రాన్' వేరియంట్ సోకకుండా అడ్డుకోలేకపోయినా, తీవ్రంగా జబ్బు బారిన పడిన వారిని కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ సోకితే పరిస్థితి విషమించకుండా, ఆసుపత్రిలో చేరే పరిస్థితి రాకుండా వ్యాక్సిన్ సంరక్షిస్తుందని చెబుతున్నారు.