ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎం కిసాన్ రాలేదా..ఫిర్యాదు ఇలా

national |  Suryaa Desk  | Published : Mon, Nov 29, 2021, 01:58 PM

పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతల్లో రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. చిన్న చిన్న తప్పుల వల్ల చాలా మంది రైతుల అకౌంట్లో నగదు జమ కావడం లేదు. స్పెల్లింగ్ మిస్టేక్స్, మీరు సమర్పించిన డాక్యుమెంట్లలో, బ్యాంకు అకౌంట్లలో పేర్లు వేర్వేరుగా ఉన్నాయేమో చెక్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ఆటోమెటిక్ సిస్టమ్ ద్వారా డబ్బుల్ని ఒకేసారి జమ చేస్తుంది.పేర్లు మ్యాచ్ కాకపోతే మనీ ట్రాన్స్‌ఫర్ జరగదు. డాక్యుమెంట్‌లో ఒక పేరు, బ్యాంకు అకౌంట్‌లో మరో పేరు ఉండటం వల్ల ఈ సమస్య వస్తోంది.


మీ సమస్యను ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ముందుగా పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయండి. అందులో ఫార్మర్స్ కార్నర్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ ఆధార్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత వివరాలు కనిపిస్తాయి. వివరాలు చెక్ చేసుకొని సరిదిద్దుకోవాలి. ఇంకా ఏవైనా తప్పులు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారుల్ని సంప్రదించాలి. పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్: 011-24300606, 155261, 0120-6025109, పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్: 18001155266, పీఎం కిసాన్ ల్యాండ్ లైన్ నెంబర్: 011—23381092, 23382401 నెంబర్లను సంప్రదించొచ్చు. pmkisan- ict@gov.in మెయిల్ ఐడీకి కంప్లైంట్ చేయొచ్చు.


రైతులారా మీరు పంటకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారా. మీ పంట సాగుకు సంబంధించి ఏ సమస్యలున్నా వెంటనే పరిష్కారం పొందవచ్చు. కింద ఇచ్చిన లింక్ ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకొని మీ పంటను ఫోటో తీయండి. వెంటనే పంటకున్న వ్యాధి పేరు చూపబడుతుంది. ఆ తర్వాత దానికి మందులను కూడా చూపబడుతుంది. ఇదంతా మీరు ఉన్న ప్రదేశం నుంచే చేసి పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి యాప్ డౌన్ లోడ్ చేసుకొని మరిన్ని వివరాలు పొందవచ్చు. https://app.adjust.net.in/6ramofe






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com